ఏపీని ఆదుకుంటం : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

ఏపీని ఆదుకుంటం : కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
  • వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

హైదరాబాద్, వెలుగు: వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్  సింగ్  చౌహాన్  ప్రకటించారు. ప్రకాశం బ్యారేజీపై కేంద్ర హోం మంత్రి అమిత్  షాతో చర్చిస్తామని తెలిపారు. విజయవాడలోని జక్కంపుడి కాలనీలో వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రి నారా లోకేష్, ఎంపీ  దగ్గుబాటు పురందేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తో కలిసి శివరాజ్ సింగ్  చౌహాన్  గురువారం పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు.

అనంతరం కలెక్టరేట్ లో మీడియాతో చౌహాన్  మాట్లాడారు. “గతంలో ఎన్నడూ చూడని జలళయాన్ని విజయవాడ చూసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. పరిస్థితులు అదుపులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. కృష్ణా నది, బుడమేరు పొంగింది”  అని శివరాజ్  అన్నారు.