కరీంనగర్ సిటీ, వెలుగు: రూ.10 కాయిన్స్ చలామణీలోనే ఉన్నాయని, వాటిని అన్ని రకాల లావాదేవీలకు వినియోగించుకోవచ్చని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బస్టాండ్ కాంప్లెక్స్ చీఫ్ మేనేజర్ తిరుపతి అన్నారు. ఆర్‌బీఐ ఆదేశాల మేరకు మంగళవారం యూబీఐ ఆధ్వర్యంలో వీధి, చిరువ్యాపారులకు రూ.10 కాయిన్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాయిన్స్‌ను స్వీకరించాలని సూచించారు. కెనరా బ్యాంకు మంకమ్మ తోట బ్రాంచ్ ఆధ్వర్యంలో రిటైల్ వ్యాపారులు, కిరాణాదుకాణాలు, చిరువ్యాపారులకు రూ.10 నాణేల చెల్లుబాటుపై అవగాహన కల్పించారు. ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ కాయిన్స్ ను తీసుకోవచ్చని, అవి ఎక్కడైనా చెల్లుతాయని వివరించారు.