యూనియన్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ క్యాంపు

యూనియన్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ క్యాంపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ముచ్చింతల స్వర్ణ భారత్ క్యాంపస్‌‌‌‌లోని యూనియన్ బ్యాంక్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్‌‌‌‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ లో బుధవారం మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్ క్యాంప్‌‌‌‌ నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైఫాబాద్ రిజనల్​ ఆఫీస్​ ఆధ్వర్యంలో ఈ క్యాంపు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం మందడి శ్రీలక్ష్మి, యూనియన్ బ్యాంక్ తరపున ముంబై ఎంఎస్ఎంఈ వర్టికల్ సెంట్రల్ ఆఫీస్ జీఎం జీకే సుధాకర్ రావు పాల్గొన్నారు. 

ఎంఎస్ఎంఈ కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న చర్యలను ముంబైలోని యూనియన్ బ్యాంక్ సెంట్రల్ ఆఫీస్ జీఎం ఆర్ఎల్ పట్టనాయక్ వివరించారు. హైదరాబాద్‌‌‌‌ జోనల్ ఆఫీస్ జీఎం అజయ్ కుమార్, డిప్యూటీ జీఎం సోనాలికా, అసిస్టెంట్ జీఎంలు రవి మారేం, జగదీష్ లేపాక్షి  పాల్గొన్నారు. మొత్తం 400 మంది కస్టమర్లు రాగా, 50 మందికి పైగా లబ్ధిదారులకు సుమారు రూ.100 కోట్లకు సంబంధించిన చెక్కును అందజేశారు.