కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పార్లమెంట్లో ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే కేంద్ర బడ్జెట్ లో బీహార్, ఏపీ, మినహా మిగతా రాష్ట్రాలకు పెద్దగా ఒరిగిందేమి లేదు. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పెట్టిన బడ్జెట్ అని ఇండియా కూటమి నేతలు విమర్శిస్తున్నారు. మరో వైపు బడ్జెట్ ప్రభావంతో ఏ వస్తువులకు ధరలు పెరుతాయో...వేటిపై ధరలు తగ్గుతాయో ఒకసారి చూద్దాం.
ధరలు పెరిగేవి
- ప్లాటినం వస్తువులు
- కాంపౌండ్ రబ్బరు
- కాపర్ స్క్రాప్
- సిగరెట్
ధరలు తగ్గేవి
- బంగారం, వెండి , వజ్రాల ఆభరణాలు
- ఎలక్ట్రిక్ వాహనాలు
- లిథియం బ్యాటరీలు
- మొబైల్
- సైకిల్స్
- ఆర్టిఫిషియల్స్ వజ్రాలు
- బొమ్మలు
- క్యాన్సర్ మెడిసిన్స్