BUDGET 2024 -2025 : కేంద్ర సాయంతో ఏపీ పునర్నిర్మాణం: చంద్రబాబు 

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఏపీ అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, ఇండస్ట్రియల్ కారిడార్లు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై దృష్టిసారించినందుకు ధన్యవాదాలు.

కేంద్రం అందించే సహకారం ఏపీ పునర్నిర్మాణానికి ఎంతో ఉపయోగ పడుతుంది” అని అందులో పేర్కొన్నారు. అభివృద్ధికి బాటలు వేసే, అందరిలో నమ్మకం కలిగించే బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు.