కుర్చీ బచావో బడ్జెట్.. బీజేపీ మిత్రపక్షాలు, మిత్రులకే మేలు: రాహుల్

కుర్చీ బచావో బడ్జెట్.. బీజేపీ మిత్రపక్షాలు, మిత్రులకే మేలు: రాహుల్

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్​తో సామాన్య ప్రజలకు ఒరిగే దేమీ లేదని లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇది ప్రధాని మోదీ తన కుర్చీని కాపాడుకో వడానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ అని విమర్శించారు. ఈ బడ్జెట్​తో బీజేపీ మిత్రపక్షాలు, ఆ పార్టీ మిత్రులైన పెట్టుబడిదారులకే మేలు చేకూరుతుందని అన్నారు. ఈ మేరకు రాహుల్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘‘ఇది కుర్చీ బచావో బడ్జెట్. మిత్రపక్షాలను బుజ్జగించడానికి ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టారు. 

మిత్రపక్షాలపై మాత్రమే హామీల వర్షం కురిపించా రు. బీజేపీ మిత్రులైన పెట్టుబడిదారులను బుజ్జగిం చడం కోసం సామాన్య ప్రజలకు మొండిచేయి చూపించా రు. కేవలం ఏఏ (అదానీ, అంబానీ)కు ప్రయోజనా లు చేకూర్చుతూ.. సామాన్య జనానికి ఎలాంటి ఉప శమనం కల్పించలేదు. ఇది కాపీ పేస్ట్ బడ్జెట్​లా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టో, గత బడ్జెట్​లను కాపీ పేస్ట్ చేశారు” అని రాహుల్ విమర్శించారు.