టూరిజం కేరాఫ్​గా నలంద వర్సిటీ

టూరిజం కేరాఫ్​గా నలంద వర్సిటీ
  • వర్సిటీతోపాటు రాజ్​గిర్​ అభివృద్ధికి కేంద్రం చర్యలు
  • కాశీ విశ్వనాథ్​ టెంపుల్​ కారిడార్​ తరహాలో విష్ణుపాద్, మహబోధి కారిడార్స్​ డెవలప్​మెంట్

న్యూఢిలీ: బిహార్​లోని నలంద వర్సిటీతోపాటు నలంద–రాజ్ గిర్​​కారిడార్​ను​ అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో పేర్కొన్నది. నలంద యూనివర్సిటీని అద్భుతమైన స్థాయికి పునరుద్ధరించడంతోపాటు టూరిజం డెస్టినేషన్​గా తీర్చదిద్దుతామని వెల్లడించింది. అలాగే, గయలోని విష్ణుపాద ఆలయ కారిడార్​, బోధ్​గయాలోని మహాబోధి ఆలయ కారిడార్లను ప్రపంచస్థాయి యాత్రా, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించింది. విజయవంతమైన కాశీ విశ్వనాథ్​ ఆలయ కారిడార్​ తరహాలో వీటిని డెవలప్​ చేయనున్నట్టు నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. 

హిందువులు, బౌద్ధులు, జైనులకు రాజ్​గిరి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కేంద్రం అని, ఈ నేపథ్యంలో దీని అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాగా, బిహార్‌‌‌‌లోని రాజ్‌‌‌‌గిర్‌‌‌‌లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం కొత్త క్యాంపస్‌‌‌‌ను  ప్రధాని నరేంద్ర మోదీ నెల క్రితమే ప్రారంభించారు. ఈ వర్సిటీకి పూర్వ వైభవాన్ని తెస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో నలంద వర్సిటీకి బడ్జెట్​లో ప్రాధాన్యం దక్కింది. 

ఒడిశా అభివృద్ధికి సహకారం

ప్రకృతి అందాలు, దేవాలయాలు, స్మారక చిహ్నాలు, హస్తకళలు, వన్యప్రాణులు, అభయారణ్యాలు, సహజమైన బీచ్​లకు ఒడిశా ప్రసిద్ధి చెందిందని నిర్మలా సీతారామన్​తెలిపారు. ఒడిశాను పర్యాక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందజేస్తామని వెల్లడించారు.