Budget 2024 : అమరావతికి రూ.15 వేల కోట్లు

ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్. అమరావతికి కావాల్సిన నిధులను వివిధ సంస్థల నుంచి సేకరించనున్నట్లు వివరించారామె. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని.. చట్టం ప్రకారం నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారామె.

ALSO READ : బడ్జెట్ 2024: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

అమరావతితోపాటు వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ చేయటం ద్వారా.. ఏపీ అర్బన్ డెవలప్ మెంట్ కోసం 15 వందల కోట్లు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారామె. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహకాలు ప్రకటిస్తున్నట్లు వివరించారు.

 

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తికి కట్టుబడి ఉన్నామని.. నిధులు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. విశాఖ, చెన్నై కారిడార్, ఓర్వకళ్లు నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. అందుకు తగ్గట్టు నిధులు విడుదల చేస్తామని లోక్ సభలో బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.