ఎన్డీయే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. సభలో విపక్షాలు ఆందోళన చేస్తుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాలు లేకుండానే బడ్జెట్ ప్రసంగం చదువుతున్నారు నిర్మలా సీతారామన్.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా 8వ సారి కావడం గమనార్హం. అత్యధిక సార్లు మోరార్జీ దేశాయ్ పది సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తొమ్మిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో 8 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ప్రణబ్ ముఖర్జీ(8 సార్లు) రికార్డ్ ను సమం చేశారు.
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
- కిసాన్ క్రెడిట్ కార్డుల లిమిట్ రూ.3లక్షల నుంచి 5లక్షలకు పెంపు
- బీహార్ లో మఖానా రైతుల కోసం ప్రత్యేక బోర్టు
- పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాలిక
ప్రయోగాత్మకంగా 100 జిల్లాలలో పీఎం ధన్ ధాన్య యోజన పథకం - ధన్ ధాన్య యోజన కింద 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
- విక్షిత్ భారత్.. జీరో పావర్టీ లక్ష్యం
- మిడిల్ క్లాస్, ఇన్ ఫ్రా ప్రాధాన్యం
- యూత్, ఫార్మర్స్, మహిళలు టాప్ ప్రయారిటీ
- 1.7 కోట్ల రైతులకు లబ్ది కలిగేలా స్కీమ్స్
- వ్యవసాయ ఉత్పత్తి పెంచడమే లక్ష్యం
- కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు వాకౌట్
- విపక్షాలు లేకుండా బడ్జెట్ ప్రసంగిస్తున్న నిర్మల
- విపక్షాల నిరసనల మధ్య బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్
- లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న నిర్మలాసీతారామన్
-
వార్షిక బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం..కాసేపట్లో లోక్ సభలో ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్
-
ప్రారంభమైన కేంద్ర కేబినెట్..బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేబినెట్
-
రాష్ట్రపతితో భేటీ అనంతరం పార్లమెంట్ కు చేరుకున్న నిర్మలా సీతారామన్
-
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 23,528 వద్ద కొనసాగుతోంది
సెన్సెక్స్ 136 పాయింట్లు పెరిగి 77,637కు చేరుకుంది
- కాసేపట్లో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నిర్మలాసీతారామన్ భేటీ
- కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం 2025-26లో ఇండియన్ ఎకానమీ 6.3 నుంచి 6.8 శాతం వృద్ధి రేటుతో పెరగనున్నట్లు అంచనా