2028 నాటికి అందరికీ రక్షిత మంచినీరు

2028 నాటికి అందరికీ రక్షిత మంచినీరు

న్యూఢిల్లీ: జల్ జీవన్ మిషన్​ను 2028 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ స్కీమ్ కింద రూరల్ ఏరియాల్లో నల్లా కనెక్షన్లతో రక్షిత తాగునీరు సప్లై చేస్తామన్నారు. డిపార్ట్​మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్  కింద జల్ జీవన్ మిషన్ అమలవుతున్నది. 15 కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. రూరల్ పాపులేషన్​లో 80శాతం మంది జల్ జీవన్ మిషన్​తో లబ్ధి పొందుతున్నారు. 2028 నాటికి 100 శాతం పూర్తి చేస్తామని నిర్మల 

ప్రకటించారు. జల్​ జీవన్​ మిషన్​కు రూ.67వేల కోట్లు కేటాయించారు. 2024–25 ఫైనాన్షియల్ ఇయర్ సవరించిన అంచనాలతో పోలిస్తే.. రూ.22వేల కోట్ల పెరుగుదలను సూచిస్తుంది. 2025–26 బడ్జెట్​లో రూ.70,162 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ మిషన్​లో ‘జన్ భాగీదారి’కి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రూరల్ ఏరియాల్లో పైప్​లైన్లు, క్వాలిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఆపరేషన్ కోసం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచనున్నారు. సస్టైనబుల్ అండ్​ సిటిజన్ సెంట్రిక్ వాటర్ సర్వీసెస్ కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఎంవోయూ కుదుర్చుకుంటామని నిర్మల ప్రకటించారు.