న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. డబ్బులను లాక్కునే అమ్మగా గతంలో పిలిచిన కొందరు ఇప్పుడు ‘మహాలక్ష్మి’ అంటూ పొగుడుతున్నారు. వేతన జీవులకు ఊరటనివ్వడంపై ఆసక్తిగా స్పందించారు. తాము ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామని కొంత మంది సోషల్ మీడియా యూజర్స్ తెలిపారు.
‘మధ్యతరగతి ప్రజలు సంతోషించండి’ అంటూ మరికొంత మంది నెటిజన్స్ పోస్టులు చేశారు. తనను ట్రోల్ చేసిన వారికి బడ్జెట్ తో నిర్మల గట్టిగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతుండటంతోనే అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నించారని వివరించారు.