ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఇవాళ ( జనవరి 24 ) హల్వా వేడుక.. ప్రాధాన్యత ఇదే..

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. ఇవాళ ( జనవరి 24 ) హల్వా వేడుక.. ప్రాధాన్యత ఇదే..

2025 - 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్రం. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరిదశకు చేరుకున్నాక ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుక చేస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ ( జనవరి 2024, 2025 ) పార్లమెంటులోని నార్త్ బ్లాక్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం పార్లమెంట్‌లోని నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగే హల్వా వేడుకకు ఆనవాయితీ ప్రకారం బడ్జెట్ తయారీలో భాగమైన అధికారులు మాత్రమే హాజరవుతారు.

పార్లమెంటులోని నార్త్ బ్లాక్ లో హల్వాను తయారు చేసి... బడ్జెట్ తయారీలో పాల్గొన్న అధికారులందరికీ వడ్డించనున్నారు ఆర్థిక మంత్రి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారుల కృషిని గుర్తించడంతో పాటు బడ్జెట్ పేపర్స్ ను ముద్రించే ప్రక్రియను మొదలుపెట్టే సందర్భంగా ఈ హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది హల్వా వేడుకకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కార్యదర్శులు, బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు.

ALSO READ | Republic Day 2025 :రిపబ్లిక్ డే 2025..థీమ్, ముఖ్యఅతిథి, చరిత్ర, ప్రాముఖ్యత

పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ జనవరి 31వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. 1980లో మొదలైన ఈ హల్వా వేడుక ప్రతి బడ్జెట్ సెషన్స్ కి ముందు ఆనవాయితీగా కొనసాగుతోంది. బడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈ బడ్జెట్ తో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఏడోసారి బడ్జెట్  ప్రవేశపెట్టిన ఘనత సాదించనున్నారు. మోడీ 3.0లో ప్రవేశపెట్టనున్న మొదటి పూర్తికాల బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.