![‘పృథ్వీ’ పథకానికి రూ.4 వేల కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్](https://static.v6velugu.com/uploads/2024/01/union-cabinet-approves-rs-4797-crore-for-prithvi-vigyan-scheme_y56XaFLhcP.jpg)
న్యూఢిల్లీ : ఎర్త్ సైన్సెస్‌కు సంబంధించిన ‘పృథ్వి విజ్ఞాన్’ కార్యక్రమానికి రూ.4,797 కోట్లు కేటాయింపులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐదు సబ్ స్కీములను కలుపుతూ ఎర్త్ సైన్సెస్ శాఖ ‘పృథ్వి విజ్ఞాన్’ కార్యక్రమాన్ని కేంద్రానికి ప్రతిపాదించింది. నిధుల కేటాయింపునకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతిపాదనపై శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్భేటీలో చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎర్త్ సైన్సెస్ ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ కార్యక్రమం కింద ‘‘వాతావరణం, వాతావరణ పరిశోధన-మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్’, ‘ఓషన్ సర్వీసెస్, మోడలింగ్ అప్లికేషన్, రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ’, ‘పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్’, ‘సిస్మాలజీ అండ్ జియో సైన్సెస్’,‘రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్అండ్ ఔట్రీచ్”అనే ఐదు స్కీమ్‌లు నడుస్తున్నాయి. ‘పృథ్వీ విజ్ఞాన్’ ద్వారా జరిగే పరిశోధనలు వాతావరణం, సముద్రం, ధ్రువాలు, క్రియోస్పియర్, భూకంపాలు తదితర అంశాల్లో సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడతాయని ఎర్త్ సైన్సెస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
మారిషస్‌తో కలిసి చిన్న శాటిలైట్ తయారీ
వచ్చే ఏడాది(2025) ప్రారంభంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించనున్న చిన్న ఉపగ్రహాన్ని ఇండియా, మారిషస్ కలిసి డెవలప్ చేయనున్నాయని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ ఉమ్మడి శాటిలైట్ తయారీ అంచనా వ్యయం రూ.20 కోట్లను ఇండియా ఇండియా భరిస్తుంది. గతేడాది నవంబర్‌లో మారిషస్ మంత్రి వి.మురళీధరన్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
గయానాతో ఒప్పందం..
క్రూడాయిల్ కొనుగోలు, హైడ్రోకార్బన్ రంగం లో సహకారం కోసం గయానాతో ఐదేండ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘గయానా నుంచి క్రూడాయిల్దిగుమతి, చమురు కోసం గయానా చేసే అన్వేషణ, ప్రొడక్షన్(ఈఅండ్‌పీ) డిపార్ట్మెంట్లో ఇండియా కంపెనీలు పాల్గొనడం, ముడి చమురు శుద్ధి రంగాలలో సహకారం” ఈ ఒప్పందంలో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.