
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దశబ్దాలుగా ఎదురుచూస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వారికే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కొంత కాలంగా ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి.