జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో 10 ఏండ్లు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్‌ను 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 60: 40గా ఉండగా, సిక్కింతో సహా ఈశాన్య రాష్ట్రాలకు 90:10శాతంగా నిధులు వెచ్చిస్తున్నారు. 3
ప్రధాన ఉద్దేశం
- శిశుమరణాల రేటు, మాతృ మరణాల రేటులను తగ్గించడం.
- స్త్రీ, శిశు ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, రోగనిరోధక శక్తి, పోషక విలువలు తదితర సేవలను అందరికీ అందజేయడం.
- స్థానికంగా వచ్చే రోగాలతోపాటు అంటు వ్యాధులను నిరోధించడం.
- సమీకృత ప్రాథమిక ఆరోగ్య రక్షణ పొందే వీలు కల్పించడం.
- జనాభా నియంత్రణ, స్థల, లింగ సమతుల్యత.
- ఆరోగ్యదాయకమైన జీవనశైలిని ప్రోత్సహించడం.
- జాతీయ ఆరోగ్య మిషన్‌లో రెండు ఉప మిషన్లు ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్.
- ఎన్ హెచ్ఎం ప్రారంభించిన కార్యక్రమాలు
- పునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, శిశు, కౌమార ఆరోగ్యం, మాతృ శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం జననీ సురక్ష యోజన, జననీ సురక్ష కార్యక్రమం.
- కమ్యూనికేషన్ డిసీజెస్ కంట్రోల్: నేషనల్ వెక్టర్బోర్న్డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, రివైజ్డ్ నేషనల్ ట్యూబర్ క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద టీబీ, మలేరియా, లెప్రసీ, హెఐవీ/ ఎయిడ్స్‌పై దృష్టి సారిస్తుంది.
- నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్: క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ వ్యాధులు, స్ట్రోక్ నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం ద్వారా మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్లను స్క్రీనింగ్ చేయడం, నిర్వహించడం. అర్బన్ హెల్త్, హెల్త్ సిస్టమ్ బలోపేతం చేసేందుకు సోషల్ హెల్త్ యాక్టివిస్ట్(ఆశా), ప్రోగ్రామ్ జాతీయ ఆరోగ్య మిషన్ వల్ల గత 10 ఏండ్లలో దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారు. 2021–22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు ఎన్ హెచ్ఎంలో చేరారు.