కాంట్రాక్ట్ లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్ ఇవ్వాలి

కాంట్రాక్ట్ లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్ ఇవ్వాలి
  • యూజీసీ, ఉన్నత విద్యామండలి చైర్మన్‌‌‌‌‌‌‌‌కు యూనియన్ ప్రతినిధుల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 యూనివర్సిటీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు యూజీసీ పేస్కేల్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయాలని, సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. గురువారం యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రికి సంఘం ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు. 15 ఏండ్లుగా 1,445 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు.

నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిల్లో వారి ఆర్టికల్స్ మేగజీన్లలో ప్రచురితమయ్యాయని, అన్ని అర్హతలున్నా తమకు యూజీసీ పేస్కేల్‌‌‌‌‌‌‌‌ను అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలనూ కాంట్రాక్ట్ లెక్చరర్లే చూస్తున్నారని పేర్కొన్నారు. చాలీచాలని జీతంతో జీవితం కొనసాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు ఉపేందర్, సనత్, శేఖర్ రెడ్డి, యాదయ్య, కృష్ణ, కృష్ణవేణి, అనురాధ, రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.