నవంబర్ 12న రామగుండం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న మోడీ

RFCL ను సందర్శించిన కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్

పెద్దపల్లి జిల్లా: రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కేంద్ర రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ సందర్శించారు. వచ్చే నవంబర్ 12వ తేదీన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఆర్ఎఫ్ సిఎల్  (RFCL)ను కేంద్ర ఎరువుల, రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ సందర్శించారు. 

ఎరువుల కర్మాగారంతోపాటు ఎన్టీపీసీ టౌన్ షిప్,  మహాత్మా గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్,  ప్రధాని సభ ప్రాంగణం, ఎరువుల కర్మాగారంలో ప్రధాని వెళ్లే రూట్ మ్యాప్ ను అరుణ్ సింఘాల్ పరిశీలించారు. కేంద్ర రసాయనశాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ వెంట పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, పోలీసు కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులు తదితరులు పాల్గొన్నారు.