ఇవాళ ( మార్చి 24 ) ఆటోడ్రైవర్ల చలో పార్లమెంట్​

ఇవాళ ( మార్చి 24 ) ఆటోడ్రైవర్ల చలో పార్లమెంట్​

నవీపేట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోడ్రైవర్స్​యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు డిమాండ్​చేశారు. ఆటో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఫైనాన్స్ నిర్వాహకులు, పోలీసులు, ఆర్టీఏ అధికారుల వేధింపులు ఆపాలని కోరారు. ఈ మేరకు  ఆదివారం నవీపేట్​మండల కేంద్రంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన చలో పార్లమెంట్​కు సంబంధించిన పోస్టర్​ ఆవిష్కరించారు. ఆటోడ్రైవర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు సయ్యద్ ఫసియుద్దీన్, కబీర్ ఖాన్, రాజారాం, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.