రామగుండం చేరుకున్న  కేంద్ర మంత్రి  భగవంత్ ఖుబా 

పెద్దపల్లి జిల్లా: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి  భగవంత్ ఖుబా రామగుండం చేరుకున్నారు.  ఈ నెల 12 న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా రామగుండం ఎరువుల కర్మాగారం  ప్రారంభోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను  పరిశీలించేందుకు ఆయన కొద్దిసేపటి క్రితం రామగుండం వచ్చారు. 

రామగుండం చేరుకున్న కేంద్ర మంత్రికి జిల్లా అధికారులు, బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా ఎన్టీపీసీ జ్యోతి భవన్ లో రాత్రి బస చేశారు. రేపు  ఉదయం ప్రధాని పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించడంతోపాటు.. ఉన్నతాధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామగుండం ఎరువుల పరిశ్రమను ప్రారంభించేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఆర్ ఎఫ్ సి ఎల్, ఎన్టీపీసి ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.