కేంద్రం అప్పు రూ.180 లక్షల కోట్లు ..ఈ ఏడాది రూ.15,27,700 కోట్లు పెరిగే చాన్స్

కేంద్రం అప్పు రూ.180 లక్షల కోట్లు ..ఈ ఏడాది రూ.15,27,700 కోట్లు పెరిగే చాన్స్

న్యూఢిల్లీ, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు రూ.180 లక్షల కోట్లకు పెరగనుంది. శనివారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర అప్పుల వివరాలను ప్రస్తావించారు. 2025–26 ఏడాదికి గాను కేంద్ర అప్పు రూ.180 లక్షల 78 వేల కోట్లకు పెరగనున్నట్లు అంచనా వేశారు.

 అందులో దేశీయ అప్పు రూ.174,14,333.42 కోట్లు, విదేశీ అప్పు రూ.6,63,920.67 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. గతేడాది 2024‌‌–25 బడ్జెట్‌లో రూ.165,50,553.49 కోట్లను అప్పుగా చూపింది. అందులో దేశీయ అప్పు కింద రూ.159,32,257.73 కోట్లు కాగా, విదేశీ అప్పు రూ.6,18,295.76 కోట్లుగా వెల్లడించింది. అంటే ఈ ఏడాది రూ.15,27,700.59 కోట్ల అప్పు పెరగనున్నట్లు కేంద్రం అంచనా వేసింది.