న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు రీసెంట్ గా నోటిఫికేషన్ విడుదలైంది. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ 5 రాష్ట్రాల్లో జారీ చేసే కొవిడ్ టీకా సర్టిఫికేట్ మీద ప్రధాని మోడీ ఫొటో పెట్టొద్దని నిర్ణయించింది. ఈ మేరకు వ్యాక్సిన్ సర్టిఫికేట్ పై ప్రధాని ఫొటో ఉండదని అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ కొవిన్ యాప్‌లో ఈ మేరకు మార్పులు చేపడతామని వివరించారు. ఎన్నికల నియమావళికి లోబడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో జారీ చేసే కోవిడ్ సర్టిఫికెట్‌పై ప్రధాని ఫొటో ఉండదని అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ కోవిన్ యాప్‌లో ఈ మేరకు మార్పులు చేపడుతుందని వివరించారు.1/2
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) January 10, 2022
మరిన్ని వార్తల కోసం: