మూడు కంపెనీల నుంచి వ్యాక్సిన్‌‌ కొంటం

గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్‌ లో హర్షవర్ధన్
వచ్చే ఏడాది ప్రారంభంలో వ్యాక్సిన్‌ వస్తుందన్న మంత్రి
టెస్టింగ్ కెపాసిటీ రోజుకు 15 లక్షలకు పెరిగిందని వెల్లడి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ మన దేశంలో వచ్చేఏడాది ప్రారంభంలో వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ చెప్పారు. వ్యాక్సిన్​ను 3 కంపెనీల నుంచి కొంటామని తెలిపారు. వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌ డిస్ట్రిబ్యూషన్​ కు సంబంధించిన ప్లాన్​ను ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్​ గ్రూప్‌‌‌‌‌‌‌‌ రెడీ చేస్తోందన్నారు.  ప్రస్తుతానికి మన దేశంలో నాలుగు ప్రీ క్లినికల్‌‌‌‌‌‌‌‌ అడ్వాన్స్డ్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌ ట్రయల్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని చెప్పారు. మంగళవారం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 21వ హైలెవెల్ మీటింగ్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. కేంద్రమంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్ సింగ్ పురి, మన్సుఖ్ లాల్ మాండవీయ, అశ్విని కుమార్ చౌబే మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రానున్న పండగల సీజన్, చలికాలంలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

86 శాతానికి పైగా రికవరీ రేట్​

దేశంలో ఇప్పటివరకు 62,27,295 మంది కరోనా నుంచి కోలుకున్నారని, రికవరీ రేట్ 86.78 శాతంగా ఉందని, డెత్ రేట్ 1.53 శాతం గా ఉందన్నారు, గత మూడురోజులుగా డబ్లింగ్ టైమ్ 74.9 రోజులకు పెరిగిందని చెప్పారు. కొన్ని  నెలలుగా కరోనా వారియర్స్ నిరంతరం పోరాడుతున్నారని, వాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనాపై పోరాటంలో ప్రజల నుంచి స్పందన ప్రోత్సాహకరంగా ఉందని, మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. దేశంలో 1,927 ల్యాబ్ లతో టెస్టింగ్ పెరిగిందన్నారు. మన టెస్టింగ్ కెపాసిటీ రోజుకు 15 లక్షల టెస్టులకు పెరిగినట్టు చెప్పారు. గడిచిన 24 గంటల్లో 11 లక్షల శాంపిల్స్ టెస్టు చేసినట్టు తెలిపారు. పండగలు రానున్నందున వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కరోనా రూల్స్ పాటించాలని ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా జన్ ఆందోళన్ ప్రారంభించారని చెప్పారు.

పాజిటివిటీ రేట్ 5 శాతానికి తగ్గించాలి: హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్

కరోనా కట్టడిలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర అంశాలపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ లో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(ఎన్ సీడీసీ) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె.సింగ్ ప్రజంటేషన్ ఇచ్చారు. దాదర్ నగర్ హవేలి, డమన్ డయ్యూలో రికవరీ రేట్ 96.25 శాతం, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో 93.98 శాతం, బీహార్ లో 93.89 శాతం ఉన్నట్టు ఆయన తెలిపారు. కేరళలో తక్కువగా రికవరీ రేట్ 66.31 శాతంగా ఉందన్నారు. వ్యాక్సిన్ తయారీ ప్రాసెస్ కు సంబంధించి నీతి ఆయోగ్ మెంబర్ వినోద్ కె పాల్ ప్రజంటేషన్ ఇచ్చారు. పాజిటివిటీ రేట్​ 5%నికి, డెత్​ రేట్ 1%నికి తగ్గించేందుకు టెస్టింగ్ పెంచాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. కేరళ, కర్నాటక, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, చత్తీస్ గఢ్​లో ఇటీవల కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కరోనాతో మరణించినవారిలో 47% మంది 60 ఏళ్ల లోపువారేనన్నారు. 53% మరణాలు 60 ఏళ్ల పైబడ్డవారు, 35% మరణాలు 45 నుంచి60 ఏజ్​ గ్రూప్​లో, 10% మరణాలు 26 నుంచి 44 ఏజ్ గ్రూప్ లో, 18 నుంచి 25 ఏళ్లు, 17 ఏళ్ల లోపు వాళ్లలో 1% చొప్పున మరణాలు నమోదైనట్లు తెలిపారు. కరోనాతో మరణించినవారిలో 70% మంది మగవాళ్లు, 30% ఆడవాళ్లు ఉన్నారని చెప్పారు. కమోర్బడిటీస్ ఉన్నవాళ్లలో డెత్ రేట్ 17.9%, కమోర్బడిటీస్ లేనివాళ్లలో డెత్ రేట్ 1.2% ఉన్నట్లు తెలిపారు.

For More News..

14 రోజుల పాపతో డ్యూటీకొచ్చిన ఐఏఎస్

గత 20 ఏండ్లలో డబులైన విపత్తులు

ఆఫీసర్లపై దసరా ప్రెషర్​