న్యూఢిల్లీ: ఆటో పీఎల్ఐ పథకం కింద ప్రభుత్వానికి దాదాపు రూ. 75 వేల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు అందాయని, ఇందులో ఇప్పటికే దాదాపు రూ. 18 వేల కోట్లు పెట్టుబడి పెట్టారని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మంగళవారం తెలిపారు.
ఢిల్లీలో జరిగిన 64వ వార్షిక సియామ్ కన్వెన్షన్‌లో మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం దేశంలో సుమారు 30 వేల ఉద్యోగాల సృష్టికి దోహదపడిందని అన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీని మరింత పెంచడానికి తమ మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు.