
- గోవా ఎమ్మెల్యే ప్రేమేంద్ర సేథ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి
ఖమ్మం టౌన్,వెలుగు : ఈనెల 27న జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారని గోవా బీజేపీ ఎమ్మెల్యే ప్రేమేం ద్ర సేథ్, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అమిత్షా పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీనీ అధికారంలోకి తీసుకురావడానికి అందరూ పనిచేయలన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోడీ మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల శారద, రుద్ర ప్రదీప్, మంద సరస్వతి, అల్లిక అంజయ్య, బోయినపల్లి చంద్రశేఖర్, గుత్తా వెంకటేశ్వర్లు, జ్వాలా నరసింహారావు, గజ్జల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.