- ఏపీ ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రి అమిత్షా హామీ
అమరావతి: ప్రకృతి విపత్తుల వేళ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) అందిస్తున్న సేవలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని తెలిపారు.
ఎన్డీఆర్ఎఫ్ అందిస్తున్న సేవలను ఇతర దేశాల నేతలు కొనియాడారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఎన్ఐడీఎం) సౌతార్న్ క్యాంపస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనూహ్య విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏవిధంగా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడు జరిగిన విధ్వంసం గురించి చింతించకండి. దాని నుంచి ప్రజలను రక్షించేందుకు ఎన్డీయే ప్రభుత్వం వచ్చింది.
ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ అండదండలు ఉన్నాయి. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తాం” అని షా పేర్కొన్నారు.