రూ.400 కోట్లిస్తే  దుర్వినియోగం చేసిన్రు .. విజయ సంకల్ప సభలో కేంద్ర హోమంత్రి అమిత్​ షా

  • ప్రాజెక్టులు నిర్మిస్తానని రైతులను మోసం చేసిన కేసీఆర్
  • దళిత బంధు పేరుతో ఎమ్మెల్యేలు కమీషన్​లు తీసుకున్నరు

నల్గొండ/నల్గొండ అర్బన్​, వెలుగు : నల్గొండ పట్టణాన్ని స్మార్ట్​ సిటీ చేసేందుకు కేంద్రం రూ.400 కోట్లు ఇస్తే, వాటిని  దుర్వినియోగం చేశారని కేంద్ర హోమంత్రి అమిత్​షా ఫైర్​అయ్యారు. శనివారం నల్గొండలో జరిగిన విజయ సంకల్ప సభకు చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి, చాణక్య బ్ర హ్మదేవాలయం, చాయ సోమేశ్వరాలయం, చెర్వుగట్టు జడల రామలింగే శ్వరస్వామి, మహావీర్​ బుద్దుడు ఉన్న ఈ గడ్డ మీద అడుగుపెట్టడం అదృ ష్టంగా భావిస్తున్నానని  చెప్పారు.  

నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్​ కనీసం సాగు, తాగునీటి ప్రాజెక్టులు కూడా చేపట్టలేదని మండిపడ్డారు. ఫ్లోరైడ్​ నివారణకు చేపట్టిన శివన్నగూడెం రిజర్వాయర్​ నిర్మాణం పనులు మధ్యలోనే ఆపేశారని, నల్గొండ, నకి రేకల్​ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా రైతులను మోసం చేశారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  దళితబంధు స్కీమ్‌‌లో బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు  రూ. లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.  అధికారంలోకి రాగానే జిల్లా అభివృద్ధికి  కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగడి మనోహర్​ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు కంకణాల నివేధితారెడ్డి, లాలూనాయక్, సాధినేని శ్రీనివాస్​రావు, నకిరేకంటి మొగిలయ్య, ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, చింత సాంబమూర్తి, నూకల న రసింహారెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, నూకల వెంకట్ నారాయణరెడ్డి  తదితరు లు పాల్గొన్నారు. 

కంచర్లను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు : మాదగాని శ్రీనివాస్​ రెడ్డి

బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని నల్గొండ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.  ఆయనకు నల్గొండను దోచుకోవడంలో ఉన్న ద్యాస  ప్రజా సమస్యలపై లేదు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే డబ్బులతో లీడర్లను కొంటున్నరు. మెడికల్ కాలేజీ అవుట్​ సోర్సింగ్​ ఉద్యోగాల్లో నల్గొండ నిరు ద్యోగులను కాకుండా నకిరేకల్​, చిట్యాల ప్రాంతాలకు చెందిన అనుచరుల ఉద్యోగాలు ఇచ్చిండు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోయింది. ఎవరెన్ని కుట్రలు చేసిన వచ్చే ఎన్నికల్లో బీజే పీ గెలవడం ఖాయం. 

పార్టీలు మారే లీడర్లకు బుద్ధిచెప్పాలి  : చల్లమల కృష్ణారెడ్డి 

 అధికారం కోసం పార్టీలు మారి  ఓట్ల కోసం వస్తున్న లీడర్లకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. సీఎం కేసీఆర్ మునుగోడును దత్తత తీసుకుంటానని ఉప ఎన్నికల్లో చెప్పి ఓట్లు దండుకున్నడు. కానీ ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టలేదు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్​ చేస్తాం.