కారును గ్యారేజీకి పంపాల్సిన టైమ్ వచ్చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటేస్తే కుటుంబ పాలన కొనసాగుతదని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయకారీ ఒప్పందం కుదిరిందన్నారు. తెలంగాణలో అవినీతిని తరిమేసేందుకు బీజేపీని గెలిపించాలని కోరారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు.
బీజేపీకి ఓటేస్తే.. బీసీ సీఎం అవుతారని అమిత్ షా తెలిపారు. అధికారంలోకి వస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిమన్నారు. ఈటల మెజార్టీ చూసి కేసీఆర్ వణికిపోవాలని చెప్పారు. కేసీఆర్ సర్కార్ మళ్లీ రావాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు.