విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు అమిత్ షా నివాళులు

పోలీసు అమరవీరుకు కేంద్రహోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద విధి నిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం దేశం మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో పురోగమిస్తోందన్నారు. దేశం సాధిస్తున్న విజయాలకు పునాది పోలీసులు, జవాన్ల త్యాగమే అని కొనియాడారు. 

ప్రధాని మోడీ తీసుకున్న కీలక నిర్ణయాలతో...దేశ అంతర్గత భద్రతలో స్పష్టమైన మార్పు వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గతంలో ఈశాన్య కశ్మీర్ లో తీవ్రవాద ప్రభావిత ఘటనలు అనేకం జరిగాయన్నారు. దీని వల్ల సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారులు ఇవ్వబడ్డాయని గుర్తు చేశారు.  కశ్మీర్ పై మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో...కశ్మీర్ అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. గతంలో ఆందోళనలో నిమగ్నమైన యువత...ఇప్పుడు..ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటుందని చెప్పారు.