సీతామర్హి/మధుబని : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్ దేనని, ఏదేమైనా సరే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం బిహార్ లోని సీతామర్హి, మధుబని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో మాట్లాడారు.
‘‘ఆర్టికల్ 370ని రద్దుచేస్తే అల్లర్లు చెలరేగుతాయని, రక్తపాతం జరుగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కానీ, గత ఐదేండ్లలో ఒక్కరూ ఒక్క రాయి విసరలే. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని కాంగ్రెస్ మిత్రుడు ఫరూఖ్ అబ్దుల్లా.. కాశ్మీరీలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీవోకేను స్వాధీనం చేసుకోకూడదంటున్నారు. కానీ, 140 కోట్ల మంది ఎవ్వరికీ భయపడరని సీతామాత జన్మభూమి సీతామర్హి నుంచి నేను మాట ఇస్తున్నా. పీవోకేను కచ్చితంగా స్వాధీనం చేసుకునుడే” అని షా చెప్పారు.