బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలకు అడ్డూ అదుపులేదు
కాంగ్రెసోళ్లు గెలిస్తే అమ్ముడుపోతరు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా
తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపే టైమొచ్చిందని ప్రజలకు పిలుపుని చ్చారు. నారాయణపేట జిల్లా మక్తల్ లో నిర్వహించిన బీజేపీఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ పదేండ్ల పాలన పూర్తిగా అవినీ తిలో కూరుకు పోయిందన్నారు అమిత్ షా. మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలకు అడ్డులేకుండా పోయిందన్నారు. ఇష్టమొచ్చినట్లు ఇసుక, మట్టి దందాలు చేసిన్రు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని అమిత్ షా ఆరోపించారు. ప్రజలు పనులు చేయకుండా దందాలు చేయడమే బీఆర్ఎ స్ ఎమ్మెల్యేల విధానమని.. బీజేపీ అధికారంలో కి రాగానే అందరిని జైలుకు పంపిస్తామన్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడూ తమ వారసుల గురించే ఆలోచిస్తాయి.. ఢిల్లీలో రాహుల్ గాంధీని, రాష్ట్రంలో కేటీఆర్ను పదవిలో కూర్చోబెట్టాలని చూస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతుల్లోనే ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. వారు మళ్లీ బీఆర్ఎస్ కు అమ్ముడుపోతరని చెప్పారు. ఈ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయిస్తయ్. కేసీఆర్ ను ఇంటికి పంపే టైమొచ్చిందన్నారు అమిత్ షా.
బీజేపీ తెలంగాణలో అధికారంలో కి రాగానే బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ చేస్తాన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఏడాదికి నాలుగు సిలిండర్లు ఫ్రీగా ఇస్తం.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తం.. ముస్లిం నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్సీ ఎస్టీలకు ఇస్తం.. అయోధ్యలో రాముడికి ఉచిత దర్శనం కల్పిస్తం.. మక్తల్, నారాయ ణపేటలో టెక్స్టైల్ పార్క్, మత్స్యకారుల కోసం నిధులు, ప్రత్యేక శాఖను ఏర్పాటుచే స్తం అని అమిత్ షా హామీ ఇచ్చారు.