ఇవ్వాల తెలంగాణకి అమిత్ షా

ఆదిలాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​లో బహిరంగ సభలుహైదరాబాద్, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. ఆదిలాబాద్​ ఎంపీ అభ్యర్థి గోడెం నగేశ్​తరఫున సిర్పూర్​ కాగజ్​నగర్​లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభలో అమిత్​షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్​ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు నిజామాబాద్​లో అర్వింద్​ తరఫున ప్రచారం చేసి బహిరంగ సభలో మాట్లాడుతారని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

దాంతోపాటు సాయంత్రం 5 గంటలకు ఈటల రాజేందర్​ తరఫున సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. సోమవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్​ తరఫున పెద్దపల్లిలో, భువనగిరి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్​కు మద్దతుగా చౌటుప్పల్​లో, నల్గొండ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొంటారన్నారు.