
కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఏప్రిల్ 23వ తేదీన చేవెళ్లకు రానున్నారు. ఈనెల 23న లక్ష మందితో చేవెళ్లలో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. చేవెళ్ల బహిరంగ సభకు ‘విజయ సంకల్ప సభ’గా నామకరణం చేశారు. చేవెళ్ల సభను విజయవంతం చేసి తీరుతామని ఇప్పటికే ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
అమిత్ షా షెడ్యూల్ ఇదే..
* ఏప్రిల్ 23 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు.
* సాయంత్రం 4 నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఆర్ఆర్ఆర్ మూవీ టీం సభ్యులతో సమావేశంకానున్నారు.
* సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 10 నిమిషాల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశంకానున్నారు.
* సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల సభకు అమిత్ షా హాజరుకానున్నారు.
* రాత్రి 7 గంటల వరకు అంటే గంట పాటు సభలో ఉండనున్నారు.
* రాత్రి 7 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
* రాత్రి 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగుప్రయాణం అవుతారు.