మోడీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం: కేంద్ర మంత్రి అమిత్ షా

మోడీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం: కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై బీజేపీ అగ్రనేత,  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన అమిత్ షా.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతించారు.  ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ పరివర్తనాత్మక సంస్కరణలు దిశగా పయనిస్తోందన్నారు. 

వన్ నేషన్ వన్ ఎలక్షన్‎కు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం భారత ఎన్నికల సంస్కరణలలో కీలక మైలు రాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.  సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణ ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే ప్రధాని మోడీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శమన్నారు.

ALSO READ | ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం

 జమిలీ ఎన్నికల నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గడం‎తో పాటు దేశ ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జమిలీ ఎన్నికలను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన  ప్రతిపక్షమైన కాంగ్రెస్.. దేశంలో  వన్ నేషన  వన్ ఎలక్షన్ విధానం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించడం కేవలం మోడీ, అమిత్ షాకు మాత్రమే ఇబ్బందని.. బహుళ ఎన్నికలతో మిగిలిన ఎవరికీ సమస్య లేదని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆప్, శివసేన (థాక్రే వర్గం) వంటి పార్టీలు కూడా జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.