ఆగస్టు 27న ఖమ్మం జిల్లాకు అమిత్ షా.. షెడ్యూల్ ఇదే

హైదరాబాద్, వెలుగు : ఈ నెల 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. గతంలోనే అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారైనప్పటికీ.. వివిధ కారణాలతో పోస్ట్​పోన్ చేశారు. 27న ఉదయం 10.35 గంటలకు అమిత్​షా ఢిల్లీలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. పాలెంలోని ఏఎఫ్ఎస్ టెక్నికల్ ఏరియా నుంచి 11 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి.. మధ్యాహ్నం 1.25 గంటలకు ఏపీలోని గన్నవరం ఎయిర్​పోర్టుకు చేరుకుంటారు.

 అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా భద్రాచలం వెళ్తారు. అక్కడ సీతారామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత హెలీకాప్టర్​లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.40 గంటలకు ఖమ్మంలోని ఎస్ఆర్​అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్​గ్రౌండ్​లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. సాయంత్రం 5.50 గంటలకు ఖమ్మం నుంచి హెలికాప్టర్​లో విజయవాడకు బయల్దేరుతారు. 6.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లిపోతారు.