- హైదరాబాద్‌లోని ఎన్పీఏ పాసింగ్ అవుట్
- పరేడ్‌లోనూ పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి
హైదరాబాద్, వెలుగు: సూర్యాపేటలో శుక్రవారం బీజేపీ నిర్వహించనున్న జనగర్జన బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ముందుగా ఆయన ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట సభకు హాజరవుతారు. ఇందుకోసం గురువారం రాత్రి 10 గంటలకు అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. పోలీసు అకాడమీ అధికారులు ఆయనను రిసీవ్ చేసుకున్నారు.
అకాడమీకి కాన్వాయ్ బయలుదేరిన సమయంలో.. అమిత్ షాకు స్వాగతం చెప్పేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ అక్కడ ఉన్నారు. వారిని గమనించిన ఆయన కాన్వాయ్‌ని ఆపి.. కిషన్‌రెడ్డిని తన కారులో ఎక్కించుకొని పోలీసు అకాడమీకి వెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార తీరు, రాజకీయ పరిస్థితులపై కిషన్‌రెడ్డితో అమిత్ షా చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అమిత్ షాను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కలిశారు. తనపై పార్టీ సస్పెన్షన్ఎత్తివేసి.. మళ్లీ టికెట్ కేటాయించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.