చండూరు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ అన్నారు. గురువారం మునుగోడు బీజేపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి నామినేషన్ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడారు. చలమల కృష్ణారెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు.
అంతకుముందు భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, చలమల కృష్ణారెడ్డి తో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.