నిధుల కోసం డివిజన్ కోరొద్దు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్

  • కాజీపేట షన్ పునర్నిర్మిస్తున్నం
  • ఎంపీ కావ్య ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానం

ఢిల్లీ: అమృత్ భారత్' స్కీమ్‌లో భాగంగా తెలంగాణలో 40కి పైగా స్టేషన్ల ఆధునీకరణ జరుగుతోందన్నారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ. 5,336 కోట్ల నిధుల కేటాయింపు తెలంగాణలో జరిగిందన్నారు.

 నిధులు ఎక్కువగా కేటాయించడం కోసం డివిజన్ కోరడం సరికాదని చెప్పారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ అంశంపై లోక్‌సభలో ప్రశ్నించారు. దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. కాజీపేట రైల్వేస్టేషన్ ను పునర్నిర్మిస్తున్నామని చెప్పారు.