మనకూ సొంత బ్రౌజర్: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

మనకూ సొంత బ్రౌజర్: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్​

న్యూఢిల్లీ: ఇండియా సొంతగా వెబ్​బ్రౌజర్​డెవలప్ చేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​గురువారం ఢిల్లీలో ప్రకటించారు. ఇది డేటాను సురక్షితంగా ఉంచుతుందని, గోప్యతకు ఇబ్బందులు రానివ్వదని అన్నారు. మనదేశం ఇప్పటివరకు ఐటీ సర్వీసులనే అందివ్వగా, ఇకనుంచి ప్రొడక్టులను కూడా తీసుకొస్తుందని,  ఇది కీలక పరిణామని ఆయన వివరించారు. ఐటీ సెక్టార్​ఏటా 282 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని మంత్రి చెప్పారు. 

బ్రౌజర్ డెవలప్‌‌  కోసం తాము చేసిన చాలెంజ్​కు స్టార్టప్​లు, విద్యాసంస్థలు, స్టూడెంట్లు, రీసెర్చర్ల నుంచి ఆశించిన స్పందన వచ్చిందని వెల్లడించారు. డేటా ప్రొటెక్షన్​ చట్టానికి అనుగుణంగా బ్రౌజర్​ను డెవెలప్​ చేస్తామని, ఇది ఐఓఎస్​, విండోస్​, అండ్రాయిడ్​ ఓఎస్​లలో పనిచేస్తుందని అన్నారు.