వరద సాయంపై అంచనా వేసేందుకు సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. రూ. 5వేల కోట్ల నష్టం జరిగిందని.. తక్షణ సాయం కింద రూ. 2వేల కోట్లు అందించాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్రెడ్డి కోరారు.
ఈ సమీక్షకు శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల హాజరయ్యారు. కేంద్రమంత్రి అయిన తర్వాత బండి సంజయ్ మొదటి సారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో వరదలకు నష్టపోయిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.
Also Read :- తెలుగు రాష్ట్రాలకు3 వేల300 కోట్ల వరద సాయం
మరో వైపు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 3 వేల 300 కోట్ల వరద సాయం ప్రకటించింది కేంద్రం. తక్షణ సాయం కింద ఈ నిధులు విడుదల చేసినట్లు వెల్లడించింది.