కేటీఆర్ లీగల్ నోటీసులకు కేంద్రమంత్రి బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. నోటీసుల్లో కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమని అన్నారు. కేటీఆర్ పేరును తాను ఎక్కడాప్రస్తావించలేదన్నారు.కేటీఆర్ తన లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదన్నారు.. రాజకీయాల్లో ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం సహజమన్నారు. ఏడు రోజుల్లో కేటీఆర్ తన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలి లేకపోతే..తాను చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. కేటీఆర్ నోటీసులకు బదులిచ్చా..తిరిగి తాను కూడా నోటీసులిస్తాననిచెప్పారు బండి సంజయ్
బూతులు తిట్టే వాళ్లు నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు బండి సంజయ్. కేటీఆర్ బావమరిది మందు దందాలో దొరికితే బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరన్నారు.బీజేపీ మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు ..కానీ పేదల జోలికి వస్తూ ఊరుకోమన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు వెంటాడుతామని చెప్పారు. బీఆర్ఎస్ ను నామ రూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించారు బండి సంజయ్