- కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్నవి విజయోత్సవాలు కాదని.. అవి వికృత ఉత్సవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పిల్లలకు పురుగులన్నం పెట్టడం విజయమని, వారి చావులు ఉత్సవమని పేర్కొన్నారు.