ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం : బండి సంజయ్ కుమార్

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం : బండి సంజయ్ కుమార్
  • కాంట్రాక్టర్లంతా సిండికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి తమాషా చేస్తున్నారు
  • కేంద్రం నిధులిస్తుంటే... కాటన్, మందులు, ఎక్స్ రే లేదని రోగులను బయటకు పంపిస్తారా?
  • ‘దిశ’ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, వెలుగు: కాంట్రాక్టర్లంతా సిండికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారి తమాషా చేస్తూ ప్రజలకు ఏళ్ల తరబడి ఇబ్బంది కలిగిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఇకపై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు 60 సీ కింద నోటీసులిచ్చి చర్యలు తీసుకోవాలని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల  అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీంనగర్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం వాడీవేడిగా జరిగింది.  బండి సంజయ్ వివిధ శాఖలపై సమీక్షిస్తూ.. అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున విద్య, వైద్య శాఖలకు నిధులిస్తోందన్నారు.  ప్రభుత్వ హాస్పిటళ్లకు కోట్లాది రూపాయలు ఇస్తున్నా ఇప్పటికీ కాటన్ లేదని, మందుల్లేవని, ఎక్స్ రే మిషన్ కరాబైందని పేషెంట్లను బయటకు పంపడం ఏంటని ఫైర్​అయ్యారు. దశాబ్దాలు మారినా సర్కార్ ఆస్పత్రుల తీరు మారదా అని మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వ హాస్పిటళ్ల రూపురేఖలు మారాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేషనల్ హెల్త్ మిషన్ నియామకాల్లోనూ భారీగా అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. మోదీ ప్రభుత్వం అర్హులందరికీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తూ.. కట్టెల పొయ్యి బాధ లేకుండా చేస్తుంటే.. వందలాది మంది పిల్లలు చదువుకునే స్కూళ్లలో ఇంకా కట్టెల పొయ్యిపై వంట చేస్తూ వారి ఆరోగ్యాలను దెబ్బతీయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇకపై కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా గ్యాస్ స్టవ్ పై మధ్యాహ్న భోజనం వండిపెట్టాలని ఆదేశించారు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్లుగా భావించాలి. కానీ కొందరు అధికారులు ఒంటి కన్నుతో చూస్తూ కేంద్ర పథకాల అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది బాధాకరం. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద రూ.398 కోట్లు మంజూరు చేసినా పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? మీరు యూసీ ఎందుకు సమర్పించలేదు? ఎంత తొందరగా యూసీ సమర్పిస్తే... అంత తొందరగా మిగిలిన రూ.70 కోట్ల నిధులను మంజూరు చేయిస్తా. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు పనుల్లో ఏది స్మార్ట్ సిటీ నిధులతో చేస్తున్నారో, ఏది నియోజకవర్గ అభివృద్ధి నిధి(సీడీఎఫ్) కింద చేస్తున్నారో ప్రజల్లో గందరగోళం నెలకొంది. 

ఇది కరెక్ట్ కాదు. స్మార్ట్ సిటీ నిధులతో ఏయే పనులు చేపడుతున్నారు?  సీడీఎఫ్ నిధులతో ఏ పనులు చేపడుతున్నారో పూర్తిస్థాయిలో వివరాలు ఇవ్వండి.’ అని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ ఝా, కమిషనర్ చాహత్ వాజ్ పేయి, సహా వివిధ శాఖల అధికారులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు.