సిద్దిపేట రూరల్, వెలుగు: యువమోర్చా నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించినట్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నీలం దినేశ్ తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్ ను మంగళవారం ఆయన ఢిల్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కేంద్ర పథకాలను ప్రజలకు చేరువచేయాలని సూచించినట్లు తెలిపారు