ఢిల్లి లిక్కర్ స్కామ్‌లో పార్ట్నర్లకు సీఎం పదవి ఇవ్వొచ్చు : బండి సంజయ్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరివింద్ కేజ్రీవాల్ రాజీనామ ప్రకటించడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పార్ట్నర్లకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా.. ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు బండి సంజయ్. అధికారం కోల్పోయి ఇక్కడ ఖాళీగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని ఢిల్లీలో ముఖ్యమంత్రిని చేసినా చేయోచ్చని ఆయన సెటైర్లు వేశారు. 

యథా రాజా.. తదా ప్రభు అన్నట్లుగా రాహుల్,MIM ల తీరు ఉందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్,ఎంపీ లక్ష్మణ్ ఆదివారం తెలంగాణ విమోచన దినోత్సవ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో మూడో సారి తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మీడియాకు తెలిపారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈరోజు పరేడ్ గ్రౌండ్ లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అందులో నిజాం నవాబుకు వ్యతిరేఖంగా పోరాడిన మహనీయుల ఫోటోలను ప్రదర్శించారు. కేంద్ర సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో బైరాన్ పల్లి, నిర్మల్ ఘటనలను తెలిపే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు.