- రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా?
- నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన
- నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా?
- మాటకు మాట... నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తా
- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ తనకు నోటీసులు పంపడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోంది. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదు. నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరే. అందుకు బదులుగానే నేను మాట్లాడిన. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో.
ALSO READ | కొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయి : కేటీఆర్
ఆయన బాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చిన. లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతాం’ అని పేర్కొన్నారు.