- కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’కు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జమిలి ఎన్నికలతో దేశ ప్రజలకే మేలు జరుగుతుందని చెప్పారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడటం అంటే.. హిందూ ధర్మంపై దాడి చేయడమే అని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఆదివారం నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో సభ్యత్వ నమోదు వేగంగా జరుగుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నరు. ఎప్పుడూ న్యూస్, సోషల్ మీడియాలో కనిపించాలనే తపన కేటీఆర్కు చాలా ఉన్నదని విమర్శించారు. అమృత్ పనుల్లో అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేయకుండా బీజేపీని ఎందుకు తిడ్తున్నడు? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది’’అని బండి సంజయ్ అన్నారు.