కాంగ్రెస్ హామీలు.. ఓటమికి టికెట్లు : బండి సంజయ్

  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ హామీలు ఆ పార్టీ ఓటమికి టికెట్ల వంటివని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై గురువారం ‘ఎక్స్’వేదికగా ఆయన స్పందించారు. హర్యానా, మహారాష్ట్ర మాదిరిగానే ఢిల్లీలోనూ కాంగ్రెస్ ఓడిపోతుందని.. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. 

అవే అబద్ధాలను రేవంత్ రెడ్డి ఢిల్లీలోనూ చెప్తున్నారని విమర్శించారు. విద్యా భరోసా కార్డ్, రూ.15 వేల రైతు భరోసా, మహిళలకు రూ. 2,500, రూ. 4 వేల పింఛన్​, ఇండ్ల స్థలాలు, రైతులకు కనీస మద్దతు ధర, ఇంటర్నేషనల్ స్కూల్స్.. ఇట్లా కాంగ్రెస్​ హామీలన్నీ నీటి మూటలే అయ్యాయని ట్వీట్​ చేశారు.