ముత్యాలమ్మ గుడికి బండి సంజయ్.. స్లోగన్స్‎తో దద్దరిల్లిన ఆలయ ప్రాంగణం

ముత్యాలమ్మ గుడికి బండి సంజయ్.. స్లోగన్స్‎తో దద్దరిల్లిన ఆలయ ప్రాంగణం

హైదరాబాద్: సికింద్రాబాద్‎లోని కుమ్మారి గూడ ముత్యాలమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో కుమ్మారిగూడలో ఇవాళ (అక్టోబర్ 14) ఉదయం నుండి హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలో కుమ్మారిగూడ ముత్యాలమ్మ ఆలయాన్ని బీజేపీ కీలక నేత,  కేంద్రమంత్రి బండి సంజయ్  సందర్శించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ దేవాలయాలపై ఇస్లాం మతస్తులు వరుస దాడులు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతోందని మండిపడ్డారు. 200 ఏళ్ల చరిత్ర గల టెంపుల్‎పై దాడి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక్కడ ప్రజల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ అమ్మవారిని.. అలాంటి తల్లి విగ్రహంపై దాడి జరగడంతో ఇక్కడి ప్రజలు ఉదయం నుండి బాధపడుతున్నారని అన్నారు. ఇలాగే దేవాలయాలపై దాడులు చేస్తుంటే హిందూ సమాజాం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ రావడంతో బీజేపీ శ్రేణులు, హిందు సంఘాల నేతల పెద్ద ఎత్తున కుమ్మారిగూడ ముత్యాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. జై శ్రీ రామ్ స్లొగన్స్‎తో ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణం హోరెత్తింది.