- సంపూర్ణత అభియాన్’స్కీంపై సమీక్ష
- ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
మక్తల్, వెలుగు: మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం 'సంపూర్ణత అభియాన్' స్కీం ను తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా 112 జిల్లాల్లోని 500 బ్లాక్లను గుర్తించగా.. తెలంగాణలో పది బ్లాకులను కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో నారాయణపేట జిల్లాలోని నర్వ మండలానికి చోటు దక్కగా.. ఈ మండలంలోని పాతర్చెడ్, రాయికోడ్ గ్రామాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, ప్రణాళిక శాఖ, భూగర్భ జల శాఖ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టింది. ఈ స్కీం కింద వీటి పని తీరు, సాధించిన ప్రగతిని తెలుసుకునేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం నర్వ మండలాన్ని విజిట్ చేయనున్నారు. బండి సంజయ్ నారాయణపేటకు 11 గంటలకు చేరుకుంటారు.
అక్కడి నుంచి రాయికోడ్ గ్రామానికి చేరుకుంటారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించనున్నారు. పల్లె దవాఖానలో 'ఆయుష్మాన్ భారత్' కింద ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించనున్నారు. వ్యవసాయ శాఖ సేకరించిన మట్టి నమూనాల వివరాలు సేకరించనున్నారు. అనంతరం నారాయణ పేట కలెక్టరేట్లో ఆఫీసర్లతో సమీక్ష చేపట్టనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.