కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కారుకు యాక్సిడెంట్

కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ కారుకు యాక్సిడెంట్

కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మకు పెను ప్రమాదం తప్పింది. పార్లమెంటు నుంచి తన కార్యాలయానికి వెళ్తుండగా తన కారుకు యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో మంత్రికి గాయాలు అయ్యాయి. తలకు, కాలికి గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

మంత్రి శ్రీనివాస్ వర్మకు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పెద్ద ప్రమాదం ఏమీ లేకపోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత విజయవాడకు బయలు దేరారు మంత్రి.

శ్రీనివాస వర్మతో పాటు కారులో ఉన్న సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. పార్లమెంటు నుంచి తన కార్యాలయానికి వెళ్తుండగా జరిగిన కారు ప్రమాదంలో పెద్దగా ప్రమాదం లేకపోవడంతో సిబ్బంది ఊపరిపీల్చుకున్నారు.